: ఆసీస్ బ్యాటింగ్ పై భారత బౌలర్ల పంజా
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు విరుచుకుపడుతున్నారు. భారత బౌలర్ల దెబ్బకు ఐదోరోజు ఆటలో ఆసీస్ జట్టు వరుసగా నాలుగు వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా రెండు వికెట్లను తీసుకోగా, అశ్విన్, ఓజా చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 129 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ నాలుగో రోజు ఆటను మూడు వికెట్ల నష్టానికి 75 పరుగుల వద్ద ముగించిన సంగతి తెలిసిందే.