: నోటీసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: మంత్రి సి.రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ మండలి ఛైర్మన్ చక్రపాణికి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. శాసనసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలను అనుసరించి.. రాజ్యాంగబద్దంగానే తాను ఛైర్మన్ కు నోటీసు ఇచ్చానని తెలిపారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తిరస్కరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గించే అంశాలు బిల్లులో ఉన్నాయని.. తీర్మానం రూపంలో అభిప్రాయం పంపుతున్నట్టు ఆయన వివరించారు.