: "భర్తలపై తప్పుడు కేసులు పెట్టవద్దు"
భర్త, అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టించి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయవద్దని భార్యా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.బాలాజీ మహిళలకు సూచించారు. ఆదివారం నాడు ఏలూరులో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ.. భర్తలు వేలాది రూపాయల జీతం సంపాదించి.. భార్య చేతిలో పెడుతున్నారని చెప్పారు. అయితే, జల్సాలకు అలవాటు పడిన కొందరు భార్యలు భర్తలపై తప్పుడు కేసులు పెడుతుండటంతో జైళ్లకు పోవలసి వస్తున్నదన్నారు. భర్త సంపాదన సరిపోవటం లేదని సాధించటంతో వారు మానసిక వత్తిడికి గురవుతున్నారని బాలాజీ చెప్పారు. కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.