: స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లును తిప్పి పంపాలని నోటీసు ఇవ్వడాన్ని సురేష్ రెడ్డి ఆక్షేపించారు. నోటీసును పరిగణనలోకి తీసుకునే ముందు నిబంధనలు పరిశీలించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.