: సీఎం నోటీసులు పరిగణనలోకి తీసుకోకండి: తెలంగాణ నేతల లేఖలు


ముసాయిదా బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం పెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్, మండలి ఛైర్మన్ కు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు విడివిడిగా లేఖలు రాశారు. మంత్రి వర్గంలో ఎప్పుడూ చర్చ జరగలేదని, అందుకే నోటీసును తిరస్కరించాలని వారు లేఖల్లో కోరారు. శాసనసభలో జరిగిన పరిణామాలను వివరిస్తూ గవర్నర్ కు కూడా లేఖ రాశారు. మంత్రి వర్గాన్ని సంప్రదించకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని ఆర్టికల్ 167(సి) చెబుతుందని కూడా వారు లేఖల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News