: 12 మంది అత్యాచారం చేసిన యువతికి గ్రామస్థుల బెదిరింపులు


పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా, 12 మంది మానవ మృగాలను జైలుకు పంపినా ఆ గ్రామ ప్రజలకు మాత్రం బుద్ధి రాలేదు. సొంతూరికి వస్తే విపరీత పరిణామాలు ఉంటాయని ఆమెను భయపెడుతున్నారు. 'ఆమె వస్తే ఊరినుంచి గెంటేస్తామని, లేకుంటే కిరోసిన్ పోసి తగులబెడతామని' బహిరంగంగా ఆ గ్రామస్థుడు చెప్పాడంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ఓ వైపు ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. ఆమెను ప్రేమించిన యువకుడు 25 వేల రూపాయలు చెల్లించి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అయినప్పటికీ 'తమ గ్రామంలో అలాంటి ఘటనేదీ చోటుచేసుకోలేదని, ఆ యువతి అబద్ధం చెబుతోంద'ని గ్రామస్థులు వాదిస్తున్నారు. బాధితురాలు భౌతికంగా కోలుకొంటోందని, ఆమెకు మనసుకు తగిలిన గాయం మానేది కాదని వైద్యులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News