: ముఖ్యమంత్రి నోటీసుపై స్పీకర్ దే తుది నిర్ణయం: దానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కే ఉందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కేంద్రం అన్ని అంశాలనూ పరిశీలించిన తరువాతే ముసాయిదా బిల్లును పంపించిందని, అలాంటి బిల్లు తప్పుల తడకగా ఉందని ప్రతిపక్ష నాయకుడు విమర్శించడం సరికాదని అన్నారు. ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రికి నోటీసిచ్చే అధికారం ఉందన్న దానం, మంత్రుల్లో బిల్లుపై భిన్నాభిప్రాయాలు ఉన్న కారణంగా నోటీసుపై కేబినెట్ లో చర్చించి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News