: సీఎం నోటీసిచ్చినట్టు తెలిసింది: దిగ్విజయ్ సింగ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కు నోటీసు ఇచ్చిన సంగతి తనకు తెలిసిందని రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బిల్లుపై తీర్మానం విషయంలో స్పీకర్ ఆధ్వర్యంలోని శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మార్చుకునే వెసులుబాటు ఉందని ఆయన అన్నారు. జరిగేది ఏమిటో వేచి చూడాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News