: దూసుకెళ్తున్న సల్మాన్ 'జయహో'.. తొలి రోజు 17 కోట్లు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'జయహో' మంచి ప్రజాదరణ పొందింది. తొలి రోజు 17 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి వందల కోట్ల క్లబ్ లో చేరేందుకు తొందర పడుతోంది. కాగా సల్మాన్ మరో సినిమా 'ఏక్ థా టైగర్' సినిమా వసూళ్లను ఈ సినిమా అధిగమించలేకపోయింది. చిరంజీవి నటించిన తెలుగు సినిమా స్టాలిన్ ఆధారంగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఐదు వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.