: రండి... హ్యాక్ చేయండి... 17 కోట్ల రూపాయలు తీసుకెళ్లండి: గూగుల్ బంపరాఫర్
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాఫ్ట్ వేర్ స్పెషలిస్టులకు బంపరాఫర్ ప్రకటించింది. మార్చిలో కెనడాలోని వాంకోవర్ లో గూగుల్ సంస్థ నిర్వహించే హ్యాకింగ్ టెస్టులో విజేతగా నిలిచి 17 కోట్ల రూపాయలు స్వంతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. బ్రౌజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రోమ్ ఓ ఎస్ ను హ్యాక్ చేసిన పరిశోధకుడికి ఈ నగదు బహుమతి అందజేయనున్నారు. గతేడాది కూడా గూగుల్ ఇలాంటి కాంటెస్ట్ నిర్వహించి భారీ బహుమతి అందజేసింది. గూగుల్ ప్రతిఏటా ఇలాంటి పోటీలను నిర్వహిస్తూ గూగుల్ క్రోమియంకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తోంది.