: పెళ్లి రిసెప్షన్ పై గ్రెనేడ్ దాడి


ఆనందంగా సంబరాలలో మునిగి తేలాల్సిన పెళ్లి రిసెప్షన్ విషాదకరంగా మారింది. కంబోడియాలోని కంపాంగ్ దోమ్ ప్రావిన్సు లో ఓ పెళ్లి రిసెప్షన్ పై దుండగుడు గ్రెనేడ్ విసిరి విధ్వంసం సృష్టించాడు. పెళ్లికి వచ్చిన అతిథులంతా సంబరాల్లో మునిగి తేలుతుండగా గుర్తు తెలియని వ్యక్తి గ్రెనేడ్ దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో 9 మంది మృతి చెందారని కంపాంగ్ దోమ్ మిలటరీ పోలీస్ ఛీఫ్ తెలిపారు. ఇది ఉగ్రవాద దాడి కాదని, ముక్కోణపు ప్రేమకథ కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News