: మతోన్మాద అరాచక శక్తులను బీజేపీ బలోపేతం చేస్తోంది: సీపీఐ నారాయణ


బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని మతోన్మాద అరాచక శక్తులను బీజేపీ బలోపేతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్రదినోత్సవాల సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందన్న విషయం, బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అప్పుడేమన్నా కళ్లు మూసుకున్నాడా? అని నిలదీశారు. రాష్ట్రపతి పంపిన బిల్లును వెనక్కి పంపి ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News