: హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి
రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. అధిష్ఠానం పెద్దలకు తెలంగాణ అంశంపై వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధాని, నదీ జలాలు, హైదరాబాద్ లోని సెటిలర్లు ప్రధాన అంశాలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరించారు. మరోవైపు తెలంగాణపై తుది నిర్ణయంపై ఉత్కంఠను కొనసాగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం మరికొందరు నేతలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించనున్నట్లు సమాచారం.