: త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
65వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా జపాన్ ప్రధాని షింజో అబే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ఆంటోనీ, చిదంబరంతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజ్ పథ్ వద్ద సైనిక శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.