: విభజనను సీఎం అడ్డుకోలేరు: షబ్బీర్అలీ
రాష్ట్ర విభజనను ముఖ్యమంత్రి కిరణ్ అడ్డుకోలేరని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బిల్లును వెనక్కి పంపే విషయమై తీర్మానం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు చెల్లదన్నారు. రూల్ 76, 77 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకే పరిమితమని చెప్పారు. కనుక సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించరని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సాఫీగా సాగిపోతుందని అన్నారు.