: తెలుగు వీరుడికి సెల్యూట్ చేసిన భారత్
మన తెలుగు తేజం, రాష్ట్రం గర్వించదగ్గ గ్రేహౌండ్స్ అధికారి, నక్సల్ దాడిలో అమరుడైన వరప్రసాద్ బాబుకు తగిన గౌరవం లభించింది. జాతి యావత్తూ ప్రసాద్ బాబు సేవలకు నేడు సెల్యూట్ కొట్టింది. అశోకచక్ర అవార్డును ప్రసాద్ బాబు తండ్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్ పథ్ లో అందించారు. ఆ సందర్భంగా అందరూ కరతాళధ్వనులతో ప్రసాద్ బాబు సేవలకు వందనం సమర్పించారు. ప్రసాద్ బాబు తండ్రి అవార్డు స్వీకరించిన అనంతరం అందరికీ నమస్కరించారు. ప్రసాద్ బాబు స్వస్థలం ప్రకాశం జిల్లా మార్టూరు.