: ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని
65వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జ్యోతి వద్ద, అమర జవాన్లకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతులు అమర వీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, తదితరులు పాల్గొన్నారు.