: పద్మ అవార్డుల ప్రకటన ... కమలహాసన్ కు పద్మభూషణ్
కేంద్ర ప్రభుత్వం 2014 సంవత్సరానికి గాను ప్రదానం చేసే పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. మషేల్కర్, యోగా గురు బీకేఎన్ అయ్యంగార్ లకు పద్మ విభూషణ్ ప్రకటించారు. ప్రముఖ సినీ నటుడు కమలహాసన్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ లకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటుడు పరేష్ రావల్, కథానాయిక విద్యాబాలన్ లకు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 24 మందికి పద్మ భూషణ్, 101 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల పూర్తి జాబితా కొరకు http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=102735 సందర్శించండి.