: ప్రజాస్వామ్యం.. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు: రాష్ట్రపతి


గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగించారు. అవినీతి, జాతికి కేన్సర్ వంటిదని రాష్ట్రపతి అన్నారు. దేశంలో ఉన్న అవినీతి, వనరుల వృధా చూసి యువత ఆందోళన చెందుతున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. యువతకు అవకాశం ఇస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం.. దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని ప్రణబ్ అన్నారు. ఎన్నికల సమయంలో అమలుకు వీలయ్యే హామీలనే నేతలు ఇవ్వాలని ఆయన సూచించారు. దేశానికి సుస్థిరమైన పాలన అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News