: సీఎం నాటకానికి.. నిర్మాత సోనియా, దర్శకుడు దిగ్విజయ్: కిషన్ రెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్న నాటకానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్మాత అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ దర్శకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ సవరణల పేరిట రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, ప్రాణహిత చేవెళ్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.