: ఇలా చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేయండి: కేంద్రానికి జేపీ ఆరు సూత్రాలు


రాష్ట్రాన్ని సామరస్య పూర్వకంగా ముక్కలు చేసేందుకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆరు సూత్రాలు ప్రతిపాదించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తాను ప్రతిపాదించిన ఆరు సూత్రాలపై చర్చించి పరిష్కరిస్తే, రాష్ట్ర ప్రజల మధ్య ఎలాంటి సమస్యలు రావని, విభజన సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.
రాయలసీమకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ, పన్ను మినహాయింపులు ఇవ్వాలని జేపీ సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపులకు, వినియోగానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ సహా రాయలసీమలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలని, వాటిని అడ్డుకోరాదని జేపీ కోరారు.
విద్యా సంస్థల ఏర్పాటు సహా హామీలను పరిశీలించి, రెండు రోజుల్లో ప్రకటన చేస్తే సభలో ఏకాభిప్రాయం వస్తుందని జేపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News