: టీ-20 క్రికెట్ మ్యాచ్ లో.. భారత్ పై శ్రీలంక విజయం
విజయనగరంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య సాగిన మహిళా క్రికెట్ హోరాహోరీగా సాగింది. శనివారం జరిగిన ఈ టీ-20 క్రికెట్ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు.. తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 147 పరుగుల స్కోర్ చేసింది. భారత్ కెప్టెన్ మిథాలీరాజ్ 67 పరుగులతో రాణించింది. అనంతరం 148 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మొదట్లో కొంత తడబడింది. తర్వాత తేరుకుని.. 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఏడు వికెట్లను కోల్పోయి శ్రీలంక గెలుపును అందుకుంది. శ్రీలంక జట్టు సారధి శశికళ సిరివర్థనే అర్థసెంచరీ (52 పరుగులు) చేసి జట్టు విజయానికి బాటలు వేసింది.