: ఆ అధికారం కేంద్రానికి, రాష్ట్రపతికి ఉంది: రావుల
ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు పంపే అధికారం కేంద్రానికి, రాష్ట్రపతికి ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ బిల్లు చర్చకు వచ్చిన ఇన్నాళ్ల తరువాత సీఎం తిప్పి పంపాలంటూ స్పీకర్ కు నోటీసు ఇవ్వడాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. రాజ్యాంగ ప్రక్రియకు అవరోధం కలిగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై రాష్ట్రపతి ఈ నెల 30 వరకు గడువు పెంచారన్న విషయం అందరూ గ్రహించాలని ఆయన సూచించారు.