: ఇటలీలోని పీసా టవర్ కూల్చేందుకు మాఫియా కుట్ర


ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పీసా టవర్ ను పేల్చేసేందుకు ఇటలీ మాఫియా కుట్ర పన్నింది. పీసా టవర్ తో పాటు ఇటలీలోని ఇతర చారిత్రక కట్టడాలను కూల్చేసేందుకు మాపియా మ్యాప్ రెడీ చేసింది. పీసా టవర్ మరెంతో కాలం ఉండదంటూ ఓ మాఫియా నాయకుడు హెచ్చరించినట్టు రోమ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటలీ దేశంలోని ప్రముఖ ప్రార్థనాలయాలు (చర్చి), ఇతర కట్టడాలు మాపియా హిట్ లిస్ట్ లో ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ పోలీసు అధికారులు, మాజీ న్యాయమూర్తులు, సీనియర్ రాజకీయ నేతల్ని కూడా వారు లక్ష్యంగా చేసుకున్నారు. యాంటీ మాఫియా మాజీ ప్రాసిక్యూటర్, ప్రస్తుత ఇటలీ సెనేట్ గ్రాసోను కూడా మాఫియా హిట్ లిస్టులో ఉన్నారు. కారాగారంలో ఉన్న మాఫియా నాయకుడు టోటో రీనాను పోలీసులు ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి.

  • Loading...

More Telugu News