: గెలుపు ముంగిట అశ్విన్ అవుట్.. టీమిండియా 269/7
టీమిండియా మూడో వన్డేలో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంది. కానీ, గెలుపుకు 33 బంతుల్లో 49 పరుగులు అవసరమైన దశలో రవిచంద్రన్ అశ్విన్ అవుటయ్యాడు. దీంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. వరుసగా నాలుగు వికెట్లు పడిన దశలో రైనా, ధోనీలు చక్కని ఆటతీరుతో కివీస్ బౌలర్ల జోరును అడ్డుకున్నారు. రైనా అవుటవ్వడంతో ధోనీ(50)కి జత కలిసిన అశ్విన్(65) బ్యాటుతోనూ రాణించాడు. అతనికి జడేజా(35) జత కలవడంతో ఇద్దరూ కలసి కివీస్ బౌరల్లపై ఆధిపత్యం చలాయించారు. కానీ, కీలక సమయంలో భారీ షాట్ కు ప్రయత్నించి అశ్విన్ వెనుదిరగడంతో 33 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్(4) భారీ షాట్ కు ప్రయత్నించి అవుటవ్వడంతో టీమిండియా చిక్కుల్లో పడింది. దీంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.