: ముఖ్యమంత్రులను తీసేసేది ఎవరు?.. సీమాంధ్రులకా అధికారం ఉందా?: సీఎం
సీమాంధ్ర ముఖ్యమంత్రులే రాష్ట్రాన్ని అధికకాలం పరిపాలించారనే అసత్య ప్రచారం టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ నేతలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులను చేసేది సీమాంధ్ర ప్రజలా? లేక కాంగ్రెస్ అధిష్ఠానమా? అని తాను అధిష్ఠానాన్ని నిలదీశానని కూడా ఆయన చెప్పారు. దీనిలో పూర్తి తప్పు ఒప్పులు రాజకీయ పార్టీలవే తప్ప సీమాంధ్ర ప్రజలవి కావని, వారిపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.