: నేను అసలు, సిసలు హైదరాబాదీని: సీఎం కిరణ్
హైదరాబాదు గురించి శాసనసభలో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సభ్యులు అడ్డు తగిలినప్పుడు.. ఆయన స్పందించారు. హైదరాబాదు గురించి మాట్లాడే హక్కు తనకు ఇక్కడ పుట్టి, పెరిగిన వాడిగా ఉన్నదని సభ్యులకు చెప్పారు. హైదరాబాదులోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించానని, హైదరాబాదు క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించానని ఆయన తెలిపారు. హైదరాబాదులో గల్లీ గల్లీ తిరిగానని, హైదరాబాదులోని ప్రతి ప్రాంతం తనకు తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. నిజామాబాదు, కరీంనగర్ ప్రాంతాలకు కూడా తాను వెళ్లానని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి, పెరిగిన వాడిగా తాను చెప్పిన దాన్ని అర్థం చేసుకొంటే.. తనపై ఎవరికీ ద్వేషం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే వచ్చే నష్టం పైనే తన బాధ అని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడితే శాశ్వత ఇబ్బందులు కలుగుతాయని తెలపడమే తన తపన అని సీఎం కిరణ్ తెలిపారు.