: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు.. 12 ఏళ్ల సర్వీసు ఉంది: లక్ష్మీ నారాయణ
ఐపీఎస్ వదిలి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ తనకు ఇంకా 12 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు ఉందని ఆయన తెలిపారు. సీబీఐ జేడీగా విధుల నుంచి తప్పుకున్న 2013 జూన్ నుంచి తనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. అయినప్పటికీ తనకు విధులు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరనని ఆయన తెలిపారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నానని మాత్రమే లక్ష్మీనారాయణ చెప్పారు.