: హైదరాబాదు అందరిదీ... వీడి వెళ్లమంటే ఇబ్బందులు తప్పవు: సీఎం కిరణ్
హైదరాబాదుకు నిధులు ఖర్చు చేసినప్పుడు.. ఎందుకు ఖర్చు చేశారని ఎవరూ అడగలేదన్నారు. ఎందుకంటే, హైదరాబాదు అంటే అందరిదీ అని.. ఈ భావం అందరిలో ఉందని ఆయన అన్నారు. హైదరాబాదులో అవసరమైన అన్ని ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు ఉన్నాయని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో హైదరాబాదు నగరం అభివృద్ధి చెందిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు, హైదరాబాదును వీడి వెళ్ళమంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే, తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలకు కూడా కష్టనష్టాలు ఉంటాయని, ఆ నష్టాన్ని గురించి సభలో వివరిస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వాస్తవాలు అందరూ తెలుసుకోవాలని, నిజాలు చెబుతున్నప్పుడు ఎవరూ ఉలిక్కి పడవద్దని ఆయన సభ్యులను కోరారు.