: నెహ్రూపై ఆరోపణలు సబబు కాదు: శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ఖండించారు. యావద్భారతావని అభిమానించే జవహర్ లాల్ నెహ్రూపై లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను సరిచేసుకోవాలని, లేనిచో రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని శైలజానాథ్ కోరారు.