: నేను ఇక్కడే పుట్టాను.. హైదరాబాదు తరఫునే క్రికెట్ ఆడాను: సీఎం కిరణ్


వ్యవసాయంలో, నీటి పారుదల, విద్య, ఉపాధి రంగాల్లో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడాలని ఏ ముఖ్యమంత్రికి లేదని ఆయన సభ్యులకు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి జరిగితే మాత్రం.. ముఖ్యమంత్రికి సంబంధం లేదని అంటున్నారని ఆయన చెప్పారు. హైదరాబాదులో పుట్టి, పెరిగి, ఇక్కడి వీధుల్లో తిరిగినవాడినని ఆయన చెప్పారు. ఆంధ్రాకు వేరుగా క్రికెట్ జట్టు ఉన్నా.. తాను హైదరాబాదు తరఫునే క్రికెట్ ఆడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజాం కాలేజీ జట్టు కెప్టెన్ గా, హైదరాబాదు జట్టు కెప్టెన్ గా క్రికెట్ ఆడానని కిరణ్ తెలిపారు. తనకు తెలంగాణలో ఇప్పటికీ పలువురు మిత్రులున్నారని సీఎం చెప్పారు. తనతో పాటు క్రికెట్ ఆడిన 10, 12 మంది తర్వాత.. దేశానికి ప్రాతినిధ్యం వహించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News