: షారూక్ గాయం పెద్దదే.. పూర్తి విశ్రాంతికి వైద్యుల సూచన


హ్యాపీ న్యూ ఇయర్ సినిమా షూటింగు సందర్భంగా గురువారం గాయపడ్డ నటుడు షారూక్ ఖాన్ ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గాయపడ్డ వెంటనే ముంబైలో ఒక ఆస్పత్రికి వెళ్లి కట్టు కట్టించుకుని వచ్చి షారూక్ షూటింగ్ కొనసాగించారు. దాంతో గాయం చిన్నదే అనుకున్నారు. కానీ, అదే రోజు రాత్రి మళ్లీ ఆయన పూర్తిస్థాయి పరీక్షలను చేయించుకున్నారు. కుడి భుజం ఫ్రాక్చర్ అవడంతోపాటు, మోకాలి వెనుక కండరం ఒత్తిడికి గురైనట్లు వెల్లడైంది. రెండు నుంచి మూడు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు నటుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News