: జీవిత సహచరులకూ మధుమేహం..!


మధుమేహం (డయాబెటిస్) వంశపారంపర్యంగా వస్తుందన్న విషయం విదితమే. కానీ, ఇంట్లో భర్తకు టైప్ 2 మధుమేహం ఉంటే భార్యకు లేదా భార్యకు ఉంటే భర్తకు వచ్చే ముప్పు 26 శాతం అధికమని కెనడా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన చేసిన మెక్ గిల్ వర్శిటీ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తల్లో భారతీయ పరిశోధకుడు డాక్టర్ కబీర్ దాస్ గుప్తా కూడా ఉన్నారు.

ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగానే టైప్ 2 మధుమేహం వస్తుందని కూడా తేలింది. అంటే.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, సరైన నిద్ర లేకపోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం వంటి జీవితశైలి లోపాల వల్లే షుగర్ వ్యాధి వస్తుందని పరిశోధకులు చెప్పారు. కాబట్టి, ఇంట్లోని ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి వచ్చిందంటే, సహజంగానే వారి జీవిత భాగస్వామి కూడా అదే పరిస్థితుల్లో ఉంటారని, దాంతో వారికి కూడా డయాబెటిస్ ముప్పు ఉన్నట్టేనని గుప్తా వెల్లడించారు. డయాబెటిస్ నుంచి కాపాడుకునేందుకు వారు ఆహారపు అలవాట్లలో మరింత జాగ్రత్తలు పాటించాలని కూడా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News