: నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 75/3
భారత-ఆస్టేలియా జట్లమధ్య మొహాలీలో జరుగుతోన్న మూడవ టెస్ట్ లో ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో నాలుగోరోజు ఆట ముగిసేసరికి 21 ఓవర్లు ఆడి, 75 పరుగులు చేసి 3వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు వార్నర్ 2, కొవాన్ 8 పరుగులు మాత్రమే చేయగా, స్మిత్ 5 పరుగులకే పెవిలియన్ దారిపట్టాడు. హ్యూగ్స్ 53, లేన్ 4 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.
భారత బౌలర్ కుమార్ కు మూడు వికెట్లు దక్కటం నేటి ఆటలో విశేషం. తొలిరోజు వర్షార్పణమైన ఈ టెస్ట్ కు రేపు చివరిరోజు.