: రెబల్ అభ్యర్థిగానే రాజ్యసభ బరిలో దిగుతున్నా: ఎమ్మెల్సీ చైతన్యరాజు
రాజ్యసభ ఎన్నికల్లో తాను రెబల్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ చైతన్యరాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి నిలబెడితే తనను ఓడిస్తారన్నారు. సీఎం తనకు మద్దతు ఇవ్వకపోయినా తాను ఆయనకు సలాం పెడతానని చెప్పారు. తన వెంట 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఈ నెల 26 లేదా 27న రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తానని రెండు రోజుల కిందటే చైతన్యరాజు చెప్పిన సంగతి తెలిసిందే.