: హైదరాబాదు ఆర్టీసీ కళాభవన్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు


హైదరాబాదు, ఆర్టీసీ కళాభవన్లో శుక్రవారం సాయంత్రం 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. తక్కువ రోడ్డు ప్రమాదాల విషయంలో సంస్థకు అవార్డులు రావడం కార్మికుల కృషి ఫలితమేనని ఆర్టీసీ ఎండీర చెప్పారు. ఆర్టీసీలో రోడ్డు ప్రమాదాల రేటు గణనీయంగా తగ్గిందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ, ఛైర్మన్ అవార్డులు అందజేశారు. ఇక ముందు కూడా విధి నిర్వహణలో భద్రత, అంకిత భావంతో సిబ్బంది పనిచేయాలని ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెస్సార్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News