: ఢిల్లీలో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు


ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇచ్చిన వీడియోను అనుసరించి ఢిల్లీ పోలీసు అధికారులు ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా వారం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. జనవరి 12న జరిగిన ఆందోళన సందర్భంగా ఎర్రకోట వద్ద ముగ్గురు పోలీసులు ఓ వ్యక్తిని తీవ్రంగా కొడుతూ అతని వద్ద నుంచి డబ్బులు లాక్కున్నారు. ఈ సన్నివేశాన్ని వీడియో తీసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆన్ లైన్లో పెట్టింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులను ఢిల్లీ పోలీసులు సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News