: ఇబ్బందిపెడితే వణుకు పుట్టిస్తాం: లగడపాటి


తెలంగాణ పొలిటికల్ జేఏసీ జరుప తలపెట్టిన సడక్ బంద్ మీద తన స్పందన వెలిబుచ్చారు ఎంపీ లగడపాటి రాజగోపాల్. కొంచెం సేపటి క్రితం ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మీడియాతో ముచ్చటించారు. బంద్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతే సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు.

సడక్ బంద్ పేరిట అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే నిర్వాహకుల ఒంట్లో వణుకు పుట్టిస్తామని ఆయన అన్నారు. జగ్గయ్య పేట కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో లగడపాటి పాల్గొని జిల్లా పార్టీ శ్రేణులకు తగు సూచనలు చేశారు.

  • Loading...

More Telugu News