: హైదరాబాదు ఫిలిం ఛాంబర్లో అక్కినేని నాగేశ్వరరావు సంతాప సభ
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సంతాప సభ హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని ఫిలిం ఛాంబర్లో ప్రారంభమైంది. ఈ సంతాప సభకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు తన సంపదలో ఎక్కువ భాగాన్ని తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఖర్చు చేశారని నిర్మాత ఆదిశేషగిరిరావు చెప్పారు. అక్కినేని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అక్కినేని సినీ పరిశ్రమలో ఎనలేని త్యాగం చేసిన వ్యక్తి అని సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు.