: రాజకీయాల్లోకి నా పేరు లాగొద్దు: రాఖీ సావంత్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీ పత్రిక సామ్నాలో చేసిన వ్యాఖ్యలపై రాఖీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన పేరును అనవసరంగా రాజకీయాల్లో లాగొద్దని, అలాంటివి తనకు నచ్చవని స్పష్టం చేసింది. 'నేను మంచి నాయకురాలవుతానని ఠాక్రే భావిస్తే, అందుకు ఆయనకు కృతజ్ఞతలు' అని చెప్పింది. అయితే, తాను కష్టపడి పనిచేసే నటిని మాత్రమేనని వివరించింది. రాజకీయ నేతలు ప్రత్యర్థులను విమర్శించడానికి తన పేరును వివాదాల్లోకి లాగడం తగదని మండిపడింది.