: నేను కోటీశ్వరుణ్ని...ఉద్యమం పేరు చెప్పి కోట్లు దండుకోలేదు: ఎర్రబెల్లి


అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ నేత జోగు రామన్న టీడీపీ అధినేతపై విమర్శలు చేశారు. దీనికి దీటుగా స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమం పేరిట పదవులకోసం ప్రజల ప్రాణాలు బలిగొన్నది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. దీనిపై జోగు రామన్న స్పందిస్తూ, ఇప్పుడు సంపాదనలో పడ్డవారు మాట్లాడుతున్నారంటూ ఎర్రబెల్లిని ఎద్దేవా చేశారు. దానిపై ఎర్రబెల్లి ఘాటుగా స్పందించారు. తాను ఉద్యమం పేరు చెప్పి వసూళ్లకు పాల్పడలేదని, ఉద్యమకారుల రక్తపు కూడుతినడం లేదని ఆవేశంగా అన్నారు. తన తాత, తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని, పుట్టుకతోనే తాను ధనవంతుడినని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ లా ఉద్యమం పేరుచెప్పి డబ్బులు దండుకోలేదని తెలిపారు. కేసీఆర్ కంటే కూడా తానే కోటీశ్వరుణ్ణని ఎర్రబెల్లి ఆవేశంగా అన్నారు.

  • Loading...

More Telugu News