: శాసనమండలి రేపటికి వాయిదా
శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై మండలిలో చర్చిస్తున్నప్పుడు... సమయం సరిపోదంటూ సీమాంధ్ర సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత ఏర్పడిన గందరగోళం కారణంగా మండలి ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.