: జెన్నిఫర్ లోపెజ్, పిట్ బుల్ పై ఫుట్ బాల్ వరల్డ్ కప్ పాట


ఫుట్ బాల్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు 2014 వరల్డ్ కప్ పాట సిద్ధం కాబోతుంది. ఈ పాటను జెన్నిఫర్ లోపెజ్, అమెరికన్ పాప్ గాయకుడు పిట్ బుల్, బ్రెజిలియన్ సింగర్ క్లాడియా లెయిట్టిపై చిత్రీకరించబోతున్నారు. ఈ మేరకు సాకర్ గవర్నింగ్ బాడీ నిన్న (గురువారం) ఓ ప్రకటన చేసింది. అయితే, 'వీ ఆర్ వన్' పేరుతో వచ్చే ఈ పాటను ఎప్పుడు విడుదల చేసేది మాత్రం తెలపలేదు. ఈ పాటను రాసిన పిట్ బులే దీనికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ కు రూపొందించిన 'వాకా వాకా' పాటను షకీరా రాసింది. ఆ పాటను ఆమే పాడి, నర్తించింది.

  • Loading...

More Telugu News