: ఆమెపై లైంగిక దాడి యత్నం జరిగింది: డీసీపీ


ఔటర్ రింగ్ రోడ్డుపై టెక్కీపై లైంగికదాడికి యత్నం జరిగిందని డీసీపీ క్రాంతిరాణా స్పష్టం చేశారు. ఖాజగూడలో గుడికి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరైన యువతిని దుండగుడు కత్తితో బెదిరించి ఆమె కారులోనే ఔటర్ రింగ్ రోడ్డుపై లైంగిక దాడికి యత్నించాడని, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునేలోపే మార్గమధ్యంలో దిగిపోయాడని ఆయన వెల్లడించారు. షాక్ లో ఉన్న ఆమెను పోలీసులు గుర్తించి నిందితుడి వివరాలు తెలుసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారయత్నం సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News