: హిందూ, మస్లింలు.. ఇద్దరూ కావాలి: సల్మాన్


పతంగుల పండుగ సందర్భంగా గుజరాత్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కావడాన్ని సల్మాన్ ఖాన్ సమర్థించుకున్నారు. మోడీని సల్మాన్ కలవడమే కాకుండా, ఆయనను మంచి మనిషిగా ప్రశంసించినందుకు.. జయహో చిత్రాన్ని చూడరాదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మద్దతుదారులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ స్పందించారు. ముస్లిం సోదరులు గుజరాత్ లో మంచిగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. 'నా తండ్రి ముస్లిం.. తల్లి హిందువు. రెండు వర్గాలతోనూ నాకు సాన్నిహిత్యం ఉంది. వారంతా కలిసే ఉండాలని అనుకుంటున్నాను' చెప్పారు.

  • Loading...

More Telugu News