: షిండేను కలసిన అనూహ్య తండ్రి
మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్య హత్య కేసులో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను ఆమె తండ్రి ఢిల్లీలో ఈ రోజు కలిశారు. కేసుపై త్వరగా విచారణ జరిపించి నేరస్థులను శిక్షించాలని కోరారు. కొన్ని రోజుల కిందట ముంబయిలో అనూహ్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. అంతకుముందు కుమార్తె కనిపించడంలేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కుటుంబసభ్యులే కష్టపడి పదకొండు రోజుల తర్వాత మృతదేహాన్ని కనుగొన్నారు. దాంతో, వారి కుటుంబం తీవ్రంగా రోదిస్తోంది. తమకు న్యాయం చేయాలని అప్పటినుంచి డిమాండు చేస్తోంది.