: పరిటాల రవిది ప్రభుత్వ హత్యే: చంద్రబాబు


హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పరిటాల రవిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. పరిటాల భద్రత తగ్గించి నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. దోషులపై ఇంతవరకు చర్యలు చేపట్టలేదని, ఆశయం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి రవి అని కొనియాడారు.

  • Loading...

More Telugu News