: ప్రతి సభ్యుడికి ఐదు నిమిషాలు కేటాయించిన స్పీకర్
టీబిల్లుపై చర్చకు మరో వారం రోజుల గడువు పెరగడంతో... సభలో చర్చ వేగం పుంజుకుంది. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ వారు కోరుకున్నంత సమయం ఇవ్వడం కుదరనందున (కేవలం ఆరు రోజుల సమయమే ఉంది)... ప్రతి సభ్యుడికి ఐదు నిమిషాల సమయం కేటాయిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.