: అది అలవాటైతే ఆనందమే: జస్టిస్ రమణ


యాంత్రిక జీవనంతో పాటు, తీసుకునే ఆహారం నేడు మానవుడిని ప్రమాదంలోకి నెడుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ప్రతిరోజూ మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని జీవన నియమాలను నేర్చుకుని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఒకసారి ఇది అలవాటైతే, ఆనందంగా జీవించడం సాధ్యమవుతుందని చెప్పారు.

ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చనారు. ధ్యానం ప్రేమ, శాంతి, సహనం తద్వారా ఆధ్యాత్మికత అలవడతాయని తెలిపారు. హైదరాబాద్ లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో న్యాయమూర్తులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. 

  • Loading...

More Telugu News