: శాసనసభ ప్రారంభం.. 15 నిమిషాల పాటు వాయిదా
శాసనసభ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో ఓటింగ్ పై స్పష్టత ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నిన్న బీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలను విజయమ్మ, శోభానాగిరెడ్డిలను అడిగి తెలుసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులకు సూచిస్తూ, ఆందోళన విరమించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.